వైఎస్‌కువెయ్యి ఎకరాలు: దత్తాత్రేయ ఆరోపణ
విజయవాడ:భూమి పంపిణీ చేస్తామని ప్రభుత్వంపదే పదే చెబుతోందని, అసలు పంచడానికిభూమి ఎక్కడుందో చెప్పాలని బిజెపి నాయకుడు బండారుదత్తాత్రేయ సవాలువిసిరారు. కాంగ్రెస్ నాయకుల చేతుల్లోనే లక్షలాది ఎకరాలభూమి ఉందనిఆయన అన్నారు. ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డికి వెయ్యి ఎకరాల భూమిఎక్కడి నుంచి వచ్చిందని దత్తాత్రేయప్రశ్నించారు. భూమి పంపిణీపై కాంగ్రెస్ చెబుతున్నవన్నీ కాకమ్మకబుర్లేననిఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంఏర్పాటు 75 శాతం పూర్తయిందని చంద్రశేఖరరావు చెప్పడం పచ్చిమోసమని ఆయన విమర్శించారు. వచ్చేఎన్నికల్లో బిజెపి-టిఆర్‌ఎస్‌ల మధ్యపొత్తు కుదిరే అవకాశంలేదన్నారు.












Click it and Unblock the Notifications
