వివికి బెయిల్: కేసులన్నీ హైదరాబాద్‌లోనే విచారణ
హైదరాబాద్: నిషేధం తర్వాత మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడరనే ఆరోపణపై హైదరాబాద్‌లో చాదర్‌ఘాట్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో విప్లవ కవి వరవరరావుకు బెయిల్ మంజూరయింది. వరవరరావుకు నాంపల్లి కోర్టు షరతులు లేని బెయిల్‌ను మంజూరు చేసింది. పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద పోలీసులు ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. అయితే ఆయన వెంటనే విడుదలయ్యే అవకాశాలు లేవు. అనంతపురం జిల్లా మదిగుబ్బలో కానిస్టేబుల్‌పై దాడి, హత్యా యత్నం కేసులో ఆయనకు అనంతపురం కోర్టు జ్యుడిష్యల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన జైలులోనే ఉండాల్సి వస్తుంది.
అయితే వరవరరావుకు ఒక వెసులుబాటు లభించింది. వరవరరావుపై ఉన్న అన్ని కేసుల విచారణను హైదరాబాద్‌లోనే చేపట్టాలని కోర్టు ఆదేశించింది. గుంటూరు, మహబూబ్‌నగర్, అనంతపురం, తదితర జిల్లాల్లో వరవరరావుపై కేసులు నమోదయయ్యాయి. విప్లవ రచయితల సంఘం (విరసం) అధ్యక్షుడు కల్యాణ్‌రావుకు పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కేసులో కోర్టు బుధవారంనాడే బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications
