పాఠశాలలే బస్సులు పెట్టాలి: హైదరాబాద్ కలెక్టర్
హైదరాబాద్: తమ తమ విద్యార్థులను ఆయా పాఠశాలలు తమ తమ బస్సుల్లోనే తీసుకుని వెళ్లాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అరవింద్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ కాపీలను హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లోని పాఠశాలల యాజామాన్యాలకు పంపినట్లు ఆయన శుక్రవారంనాడు మీడియా ప్రతినిధులతో చెప్పారు. పాఠశాలలకు నవంబర్ 15వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారుల మృతి నేపథ్యంలో కలెక్టర్ ఈ ఆదేశాలు జారీ చేశారు.
నిబంధనలను పాటించలని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో 12,000 పాఠశాలలు ఉన్నాయని, వీటన్నిటికీ నోటిఫికేషన్ ప్రతులు పంపామని ఆయన చెప్పారు. విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించని పాఠశాలల యాజమాన్యాలపై పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications