ఎపి ప్రాజెక్టులపై 7లోగా నిర్ణయం: ప్రియరంజన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే విషయంపై సెప్టెంబర్ 7వ తేదీ లోగా నిర్ణయాలు తీసుకుంటామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి బుధవారం ఉదయం ప్రియరంజన్ దాస్ మున్షీని కలిసి రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై విజ్ఞప్తులు చేశారు.
నాగార్జునసాగర్ కాల్వల మరమ్మతుకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. ప్రాజెక్టు పాతదే అయినందున ఇబ్బంది కలగకపోవచ్చునంటూ ప్రియరంజన్‌దాస్ మున్షీ సానుకూలంగా ప్రతిస్పందించారు. శ్రీరాంసాగర్ వరద కాలువ ప్రాజెక్టు నివేదికను ముఖ్యమంత్రి అందజేశారు. ఎల్లంపల్లి, దుమ్ముగూడెం ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి దాస్‌మున్షీని కోరారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తే 600 కోట్ల నిధులు వాడుకోవడానికి వీలు కలుగుతుందని రాజశేఖర్ రెడ్డి ఆయనకు వివరించారు. రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తికి ప్రియరంజన్ దాస్ సానుకూలంగా ప్రతిస్పందించారు.












Click it and Unblock the Notifications
