కేంద్రం నుంచి వైదొలగేది లేదు: నరేంద్ర
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగబోమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఎ.నరేంద్ర బుధవారం ఇక్కడ ప్రకటించారు. యుపిఎ పార్టీలన్నీ కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని, కాంగ్రెస్ పార్టీ అందులో ఒక భాగస్వామ్య పక్షం మాత్రమేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కారణంగా తమ మంత్రులు వైదొలిగారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ నిన్న చంద్రశేఖరరావును కలుసుకునేందుకు ప్రయత్నించలేదని, పిసిసి అధ్యక్షుడు కేశవరావు ఫోన్ చేశారని నరేంద్ర వెల్లడించారు. మొహం చాటేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.












Click it and Unblock the Notifications