డిసెంబర్‌లో అద్వానీ పార్టీ పదవికి రాజీనామా
చెన్నై: తాను పార్టీ పదవికి ఈ ఏడాది డిసెంబర్‌లో రాజీనామా చేస్తానని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు ఎల్.కె. అద్వానీ ప్రకటించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగింపు ప్రసంగంలో ఆయన ఆదివారం ఆ విషయాన్ని ప్రకటించారు. పార్టీని నియంత్రించాలనుకోవడం బిజెపికి గానీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌యస్‌యస్)కు గానీ మంచిది కాదని ఆయన అన్నారు.
పాకిస్థాన్ పర్యటనలో అద్వానీ ఆ దేశ జాతీయ నాయకుడు జిన్నా లౌకికవాదిగా ప్రశంసించడంపై దేశ వ్యాప్తంగా వివాదం చెలరేగింది. అద్వానీ జిన్నాను లౌకికవాదిగా పేర్కొనడంపై ఆర్‌యస్‌యస్ తీవ్రంగా మండిపడింది. అద్వానీ పార్టీ పదవికి రాజీనామా చేయాల్సిందేనని ఆర్‌యస్‌యస్ డిమాండ్ చేస్తూ వస్తోంది. ఇటీవల పార్టీ నాయకుడు ఖురానా అద్వానీపై తీవ్రంగా ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications
