తప్పని తేలితే పత్రికలు మూసేసుకుంటారా?: జానా
నల్లగొండ: ఢిల్లీలో జరిగిన నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి నివేదిక సమర్పించారని వచ్చిన వార్తలను రాష్ట్ర హోం మంత్రి కె. జానారెడ్డి మరోసారి ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి మావోయిస్టులతో సంబంధాలున్నట్లు వైయస్ నివేదిక సమర్పించారని వార్తలు తప్పని తేలిస్తే పత్రికలను మూసేసుకుంటారా అని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో పత్రికా యాజామాన్యాలను సవాల్ చేశారు. తాను రుజువు చేయలేకపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు.
తెరాస ఏర్పాటు చేసిన తెలంగాన జాగరణ సేన (టిజెయస్)కు మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఏ విధమైన ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు సమాచారంపై ఆధారపడి తెరాస నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిపై విమర్శలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications