మమ్మల్ని కెసిఆర్ సమర్థించారు: మందాడి, దుగ్యాల
హైదరాబాద్: తమ వ్యాఖ్యలను తమ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు సమర్థించారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి శాసనసభ్యులు మందాడి సత్యనారాయణ రెడ్డి, దుగ్యాల శ్రీనివాసరావు ప్రకటించారు. పార్టీ అధిష్ఠానవర్గంపై ఈ ఇరువురు శాసనసభ్యులు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిరువురితో పాటు మరో ఇద్దరు శాసనసభ్యులతో చంద్రశేఖర్ రావు గురువారంనాడు సమావేశమయ్యారు.
తాము చేసిన సూచనలకు కార్యరూపం ఇస్తామని చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చినట్లు మందాడి సత్యనారాయణ రెడ్డి, దుగ్యాల శ్రీనివాసరావు చెప్పారు. బుధవారం జరిగిన పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి వీరిద్దరు హాజరు కాలేదు. వారిని బుజ్జగించి సమావేశానికి రప్పించాలని చంద్రశేఖర్ రావు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన వారిని ఒప్పించి, వారితో గురువారంనాడు సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications