గుంటూరు కార్పోరేషన్ పదవులపై ఒప్పందం
హైదరాబాద్: గుంటూరు నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల విషయంలో ఎట్టకేలకు కాంగ్రెస్ వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. మేయర్ పదవిని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు కన్నా నాగరాజు రెండున్నర ఏళ్లు, పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి మోహనకృష్ణ రెండున్నర ఏళ్లు చేపట్టడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సమక్షంలో ఒప్పందం కుదిరింది. అది సద్దుమణగగానే డిప్యూటీ మేయర్ పదవి విషయంలో వివాదం ముందుకు వచ్చింది.
డిప్యూటీ మేయర్ పదవి విషయంలో ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. డిప్యూటీ మేయర్ పదవిని శాసనసభ్యుడు వెంకటరావు సోదరుడు తాటికొండ మురళీమోహన్ మొదటి రెండున్నర ఏళ్లు చేపడతారు. చివరి రెండున్నర యేళ్లు షేక్ గౌస్ చేపడతారు. మేయర్ పదవిని మొదటి రెండున్నర సంవత్సరాలు కన్నా లక్ష్మినారాయణ కుమారుడు నాగరాజు చేపడతారు. తర్వాతి రెండున్నర యేళ్లు మోహనకృష్ణ చేపడతారు.












Click it and Unblock the Notifications
