పులిచింతల స్థలాన్ని మార్చాల్సిందే: తెరాస
హైదరాబాద్: కృష్ణానదిపై తలపెట్టిన పులిచింతల ప్రాజెక్టుపై తమ వైఖరి స్పష్టంగా ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు విజయరామారావు చెప్పారు. పులిచింతలపై తమ వైఖరి మారలేదని ఆయన చెప్పారు. పులిచింతల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడుకు మధ్య బుధవారం శాసనసభలో వాగ్వివాదం చెలరేగిన సమయంలో పులిచింతలపై మాట్లడడానికి తమకు కూడా అవకాశం ఇవ్వాలని విజయరామారావు స్పీకర్‌ను కోరారు.
తాము పులిచింతల ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, అయితే ప్రాజెక్టు స్థలాన్ని మార్చాలనేది తమ డిమాండ్ అని ఆయన చెప్పారు. స్థలమార్పిడిపై సమీక్ష చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తమ నేతలకు హామీ ఇచ్చారని ఆయ గుర్తు చేస్తూ అటువంటి సమీక్ష ఏమైనా చేశారా, దానిపై ఏ నిర్ణయం తీసుకున్నారు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పులిచింతల వల్ల నల్లగొండ జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, నల్లగొండ జిల్లాలోని సున్నంరాయి గనులు, ఆయకట్టు మునిగిపోతాయని, దీన్ని నివారించడానికి పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మార్చడం అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
