మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌పై కాల్పులు

పాట్నా: భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్‌ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌పై హత్యాప్రయత్నం జరిగింది. బీహార్‌లోని ససారం ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించడానికి లేచిన సమయంలో ఆయనపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆయన ఎడమ భుజానికి బుల్లెట్‌ గాయం అయింది. దాంతో అగ్రహోద్రగులైన బిజెపి కార్యకర్తలు కాల్పులు జరిపిన దుండగుడిపై విరుచకుపడ్డారు. ఈ దాడిలో దుండగుడు మరణించాడు.

ఈ ఎన్నికల ప్రచార సభలో బిజెపి సీనియర్‌ నాయకుడు ప్రమోద్‌ మహాజన్‌ కూడా వేదికపై ఉన్నారు. సపారంలో రవిశంకర్‌ ప్రసాద్‌కు చికిత్స చేశారు. ఆ తర్వాత ఆయనను పాట్నాలోని ఆలోక్‌ ఆస్పత్రికి తరలించారు. రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని బిజెపి సీనియర్‌ నాయకుడు అరుణ్‌ జైట్లీ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+