సుప్రీం తీర్పుపై బూటాసింగ్ నో కామెంట్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పునై వ్యాఖ్యానించడానికి బీహార్ గవర్నర్ బూటాసింగ్ నిరాకరించారు. బీహార్ శాసనసభను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుపై తాను మాట్లాడేదేమీ లేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, దాన్ని అందరూ గౌరవించాల్సిన అవసరం ఉందని మాత్రమే ఆయన అన్నారు. బీహార్ గవర్నర్ పదవికి బూటాసింగ్ రాజీనామా సమర్పంచే అవకాశాలున్నాయి. బూటాసింగ్‌ను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications