చాలెంజర్ ట్రోఫీ పోటీలకు గంగూలీ దూరం
ముంబాయి: చాలెంజర్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆడడం లేదు. మోచేతి గాయం కారణంగా ఆయన ఈ టోర్నమెంట్‌కు దూరంగా వుంటున్నారు. మోచేతికి స్వల్పంగా గాయం కారణంగా పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వేద్యులు గంగూలీకి సలహా ఇచ్చారు. దీంతో ఆయన చాలెంజర్ ట్రోఫీ టోర్నమెంట్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు.
శుక్రవారం ఉదయం గంగూలీ ముంబాయికి చేరుకున్నారు. భారత జట్టు ఫిజియో థెరపిస్తు జాన్ గ్లోజర్, బిసిసిఐ స్పోర్ట్స్ ఇంజ్యూరీ స్పెషలిస్టు డాక్టర్ అనంత్ జోషి గంగూలీ గాయాన్ని పరిశీలించారు. వారు గంగూలీ గాయాన్ని పరిశీలించి, ఎంఆర్‌ఐ నివేదికను చూశారు. గంగూలీ మోచేతికి స్వల్పంగా గాయమైనట్లు వారు నిర్ధారించారని బిసిసిఐ ఒక ప్రకటనలో తెలియజేసింది.












Click it and Unblock the Notifications