విజయవాడ మేయర్‌గా తాడి శకుంతల

హైదరాబాద్‌: విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌గా సిపిఐ కార్పోరేటర్‌ తాడి శకుంతల ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌, సిపిఐలకు మధ్య జరిగిన ఒప్పందం మేరకు ఆమె ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగుతారు. డిప్యూటీ మేయర్‌గా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కృష్ణకుమార్‌ ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌కు అత్యధిక డివిజన్లు వచ్చినప్పటికీ ఎన్నికలకు ముందు వచ్చిన అవగాహన మేరకు సిపిఐకి మొదటి ఏడాది మేమర్‌ పదవి ఇవ్వడానికి ఆ పార్టీ అంగీకరించింది.

మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సందర్బంగా విజయవాడ కార్పోరేషన్‌ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తమ పార్టీ నాయకులను లోనికి రానీయకపోవడంతో కాంగ్రెస్‌ కార్పోరేటర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ సమయంలో వారికి, పోలీసులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

మేయర్‌గా ఏడాదికొకరు ఉండడం తమ సంప్రదాయమేనని తాడి శకుంతల అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు విజయం సాధించిన కాలంలో ఆ సంప్రదాయాన్ని పాటించామని, గత తెలుగుదేశం పార్టీయే దానికి తిలోదకాలు ఇచ్చిందని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+