సంపూర్ణ మద్యనిషేధం అసాధ్యం: రోశయ్య
ఒంగోలు: సంపూర్ణ మద్యపాన నిషేధం నినాదం రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే ఉపయోగపడుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి కె. రోశయ్య అన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య శతజయంతి సభలో ఆయన మంగళవారంనాడు ప్రసంగించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం నినాదంగా మాత్రమే ఉపయోగపడుతుందని, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు ఆచరణ సాధ్యం కాదని ఆయన అన్నారు.
1994 ఎన్నికల్లో ఇచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధం నినాదాన్ని గమనిస్తే మనకు ఆ విషయం అర్థమవుతుందని ఆయన అన్నారు. అయితే చిత్తశుద్ధితో కృషి చేస్తే కొంత పలితం సాధించవచ్చునని ఆయన అన్నారు. 1947 నుంచి అప్పుడప్పుడు ప్రకటించిన మద్యపాన నిషేధం అమలును పరిశీలిస్తే అది ఆచరణ సాధ్యం కాదని తెలిసిపోతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
