వైద్యసేవలపై మంత్రి రోశయ్య అసంతృప్తి
ఒంగోలు: రాష్ట్ర ప్రజలకు అందుతున్న వైద్య సేవల పట్ల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కె. రోశయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైద్య సేవల పట్ల తానే సంతృప్తిగా లేనని, ఇక ప్రజలు ఎలా సంతృప్తిగా ఉంటారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వైద్యుల కొరత తీవ్రంగా ఉండడం వల్లనే ప్రజలకు సరైన సేవలు అందడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల నియామకం జరపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే వైద్యులెవరూ పని చేయడానికి ముందుకు రావడం లేదని ఆయన చెప్పారు. ఈ విషయమై చర్చించడానికి ఈ నెల 14వ తేదీన ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
