థాయ్‌లాండ్ ఓపెన్: తప్పుకున్న సానియా
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ టెన్సిస్ టోర్నమెంట్ నుంచి హైదరాబాద్ టెన్నిస్ తార సానియా మీర్జా మధ్యలో నుంచే తప్పుకుంది. వెన్ను నొప్పి కారణంగా ఆమె రెండో రౌండ్ ఆట మధ్యలోనే ఆట నుంచి తప్పుకుంది. ఆమె ఆట నుంచి తప్పుకోవడానికి ముందు చైనా క్రీడాకారిణి మెంగ్ యువా చేతిలో 5-7 స్కోరుతో వెనకబడి ఉంది. జపాన్ ఓపెన్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకున్న సానియాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆమె అనివార్య కారణాల వల్ల మధ్య నుంచే తప్పుకోవాల్సి రావడంతో అభిమానులు నిరాశ చెందారు.












Click it and Unblock the Notifications
