సైనికుడు షూటింగ్‌లో ప్రమాదం: ఒకరి మృతి

హైదరాబాద్‌: మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న సైనికుడు సినిమా షూటింగ్‌లో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కమల్‌ అనే వ్యక్తి మరణించాడు. ఇతను కెమెరామన్‌ అసిస్టెంట్‌ అని తెలుస్తోంది. ఈ ప్రమాదంతో భయకంపితులైన యూనిట్‌ సభ్యులు పరుగులు తీశారు. ఈ హడావిడిలో కొంత మంది గాయపడ్డారు.

దాదాపు 70 మంది షూటింగ్‌ ప్రదేశంలో ఉన్నట్లు సమాచారం. సినిమా షూటింగ్‌ కోసం ఒక స్విమ్మింగ్‌ పూల్‌ సెట్‌ వేశారు. ఈ సందర్భంగా కరెంట్‌ వైరు తెగి నీళ్లలో పడడంతో షాక్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ షాక్‌ తగిలి కమల్‌ మరణించినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన కమల్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఆపరేటివ్‌ కెమెరామన్‌. రంగారెడ్డి జిల్లా మేడ్చేల్‌ వద్ద గల రాధికా గార్డెన్స్‌లో ఈ ప్రమాదంలో సంభవించింది. ఈ షూటింగ్‌ జరుగుతున్నప్పుడు హీరో మహేష్‌ బాబు కూడా అక్కడే ఉన్నారు. ఆయన సురక్షితంగా ఉన్నారు. కమల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యు ఒడిలోకి జారిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+