వడోదరలో నెలకొంటున్న శాంతి
గాంధీనగర్: మత కలహాలు జరుగుతున్న గుజరాత్ నగరం వడోదరలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. దీంతో శుక్రవారంనాడు ఆర్మీని ఉపసంహరించారు. కక్ఫ్యూను కూడా కొంత సడలించారు. దాంతో వ్యాపారస్తులు దుకాణాలను తెరిచారు. జన జీవనం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. అయితే పెట్రోలింగ్ మాత్రం కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications