తెలంగాణకు మేం వ్యతిరేకం: బర్దన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తాము వ్యతిరేకమని, ఈ విషయాన్ని తాము తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని యుపిఎ సబ్ కమిటీకి తెలియజేశామని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ప్రధాన కార్యదర్శి ఎ.బి. బర్దన్ అన్నారు. తాము చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
తెలంగాణపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) అవకాశవాద విధానాన్ని అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు మద్దతు ఇస్తామంటున్న బిజెపితో తెలంగాణ ఏర్పాటును కోరుకుంటున్న పార్టీలు వెళ్లవచ్చునని ఆయన అన్నారు. బిజెపి తెలంగాణపై తమ మాటను మళ్లీ మార్చుకోవచ్చునని ఆయన అన్నారు. యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం పెట్రో ధరలు పెంచితే సహించబోమని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే ప్రభుత్వం చాలా సార్లు సియంపిని ఉల్లంఘించిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
