కాకినాడలో సాఫ్ట్‌వేర్ పార్కు: దయానిధి మారన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్‌ను నెలకొల్పనుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం 11 సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులను స్థాపించాలని నిర్ణయించింది. ఇందులో ఒకటి కాకినాడకు వస్తుంది. ఈ విషయాన్ని ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి దయానిధి మారన్ బుధవారం లోక్‌సభలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 11 సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులను నెలకొల్పుతుందని ఆయన సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.
మిగతా పది సాఫ్ట్‌వేర్ పార్కులను భోపాల్, గ్వాలియర్ (మధ్యప్రదేశ్), పాట్నా (బీహార్), హాల్దియా (పశ్చిమ బెంగాల్), బెర్హాంపూర్ (ఒరిస్సా), ఆగ్రా (ఉత్తరప్రదేశ్) గోవా, షిల్లాంగ్ (మేఘాలయ), అగర్తాలా (త్రిపుర), గుల్బర్గా (కర్ణాటక)లలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఐటి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి గల భారత సాఫ్ట్‌వేర్ పార్కుల సంస్థ ఈ సాఫ్ట్‌వేర్ పార్క్‌లను ఏర్పాటు చేస్తుంది. ఇప్పటి వరకు దేశంలోని 21 రాష్ట్రాల్లో 47 సాఫ్ట్‌వేర్ పార్కులున్నాయి.












Click it and Unblock the Notifications