లాడెన్ బతికే ఉన్నాడు: సౌదీ టెలివిజన్
దుబాయ్: అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ బతికే ఉన్నాడని దుబాయ్‌కి చెందిన ఆల్ అరేబియా టెలివిజన్ తెలియజేసింది. తమ నేత బతికే ఉన్నాడని తాలిబాన్ అధికార ప్రతినిధులు చెప్పినట్లు ఆ టెలివిజన్ వార్తను ప్రసారం చేసింది. పాకిస్థాన్‌లో గత నెలలో లాడెన్ మరణించినట్లు సౌదీ ఇంటలిజెన్స్ వర్గాలు పసిగట్టినట్లు ఫ్రాన్స్ రహస్య పత్రాలు వెల్లడించాయి.
లాడెన్ మరణించినట్లు ఏ విధమైన ఆధారాలు లేవని సౌదీ అరేబియా టెలివిజన్ ప్రకటించింది. తనకు తెలిసినంత వరకు లాడెన్ బతికే ఉన్నాడని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఫిలిప్పె దౌస్తే బ్లేజీ అనాను. లాడెన్ మరణించాడనే వార్తను తాము ధృవీకరించలేకపోతున్నామని ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ ప్రకటించాయి.












Click it and Unblock the Notifications
