కరీంనగర్ ఎన్నికపై పిసిసి సమీక్ష
హైదరాబాద్: కరీంనగర్ లోక్‌సభ ఎన్నికపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) మంగళవారం సమీక్ష జరిపింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, అభ్యర్థి కె. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ సమీక్షకు ప్రాధాన్యం చేకూరింది. సమావేశంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులతో పాటు పిసిసి సీనియర్ నేతలు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కరీంనగర్ ఎన్నికలో అభివృద్ధితో పాటు తెలంగాణ సెంటిమెంటును ప్రచారాస్త్రంగా ఎంచుకోవాలని పిసిసి సమావేశంలో ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. చంద్రశేఖరరావు విమర్శలను సమర్థంగా తిప్పికొట్టడానికి సిద్ధం కావాలని జిల్లా నాయకులకు సూచనలు అందాయి. కరీంనగర్ పార్టీ అభ్యర్థి నిర్ణయం కూడా సమావేశంలో చర్చ జరిగింది. జగిత్యాల శాసనసభ్యుడు టి. జీవన్‌రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్పప్పటికీ ఇతరుల పేర్లు కూడా పరిశీలనకు వచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications