కొత్త పార్టీపై రఘురామ క్లారిటీ..! "తెలుగు వీర లేవరా" ఏర్పాటుపై..!

ఏపీలో గతంలో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి నాలుగేళ్ల పాటు ఆ పార్టీపైనే పోరాటం చేసిన రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnam raju) గత ఎన్నికల సమయంలో అనూహ్యంగా టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ కూడా అయ్యారు. అయితే తాజాగా హిందూత్వ అంశాల్లో టీడీపీ వైఖరిపై అసంతృప్తితో ఉన్న ఆయన .. సొంత పార్టీ పెట్టాలని భావిస్తున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై రఘురామ ఇవాళ క్లారిటీ ఇచ్చారు.

తాను రాజకీయపార్టీ పెట్టబోతున్నా అంటూ కొందరు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని రఘురామకృష్ణంరాజు ఇవాళ విడుదల చేసిన ఓ వీడియోలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల వల్ల తాను ఇబ్బంది పడినట్టుగా ఇతరులు పడవద్దని కొంతమంది న్యాయవాదులతో కలిపి ఓ ఫోరమ్ ఏర్పాటు చేశానని ఆయన వెల్లడించారు. అవసరమైన ప్రజలకు ఉచిత సలహాలు ఇచ్చేందుకే తాను 'తెలుగువీర లేవరా' అనే ఫోరమ్ ప్రారంభించినట్లు తెలిపారు.

Raghurama Krishnam Raju Ends Speculation New Political Platform Is a Forum Not a Rival Party

అల్లూరి సీతారామరాజు స్పూర్తితో ఫోరమ్ ఏర్పాటు చేశానని రఘురామ తెలిపారు. సొసైటీకి, పార్టీకి అసలు సంబంధమే ఉండదని, సొసైటీని ఏర్పాటు చేస్తే పార్టీ పెడుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారని రఘురామ మండిపడ్డారు. తెలుగువీర లేవరా అనేది ప్రజలకు ఉచితంగా న్యాయ సలహాలు ఇచ్చేందుకు మాత్రమే ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తాను టీడీపీలో చాలా సంతోషంగా ఉన్నానని , పార్టీలో సీఎంతో, ఇతరులతో తనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ అంశంపై స్పందిస్తూ వీడియోను విడుదల చేసి ఆ వార్తలకు చెక్ పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+