ఏంటన్నా ఇంత పెద్ద హిట్టు కొట్టావ్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమా రిజల్ట్స్ పై సంబంధం లేకుండా ఆయన వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. సూర్య సినిమాలకు తమిళంతోపాటు తెలుగులోనూ భారీ క్రేజ్ ఉంటుంది. సూర్య గత సినిమాలు అయిన గజిని, యముడు, సింగం, 24, ఆకాశమే హద్దురా, సెవెన్త్ సెన్స్, జై భీమ్, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, వీడొక్కడే తదితర సినిమాలు తెలుగులోనూ బాగానే కలెక్షన్స్ రాబట్టాయి. దాంతో సూర్య సినిమా అనగానే అటు తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తుంటారు.

అయితే సూర్య, త్రిష కాంబోలో ఇటీవల విడుదలైన చిత్రం కరుప్పు.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద సూర్య స్టామినా ఏంటో నిరూపించింది. తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజ్ అయింది. తెలుగులోనూ హిట్ టాక్ తెచ్చుకుంది. గతవారం రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఇక ఈ సినిమా ఇప్పటివరకు రూ. 200 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దాంతో సూర్య ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత సూర్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన సూర్య ఈ మధ్య కాలంలో సక్సెస్ ల విషయంలో వెనుకబడిపోయిన విషయం తెలిసిందే.

Suriya Karuppu Joins the 200 Crore Club Massive Box Office Milestone for the Tamil Blockbuster

కరుప్పు మూవీని నటుడు, డైరెక్టర్ ఆర్జే బాలాజీ తెరకెక్కించారు. అంతేకాక ఈ మూవీలో ఆయన విలన్ రోల్ కూడా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మూవీకి సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు. సూర్య, త్రిషతో పాటు ఈ మూవీలో జార్జ్ మరియన్, ఇంద్రాన్స్, నటరాజన్, స్వసిక, మన్సూర్ అలీ ఖాన్ ఇలా అందరూ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో విశ్వనాథ్ అండ్ సన్స్ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+