తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సచివాలయంలో రెండు గంటలుగా సాగుతున్న ఈ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు పాఠశాలలతో సమానంగా జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు సైతం ప్రతిరోజూ ఉదయం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం), పాలు అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రారంభించనున్న అంశాలపైనా చర్చలు జరిపింది. 2027 గోదావరి పుష్కరాలకు రూ. 1000కోట్లు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో తొలి విడతగాలో భాగంగా రూ. 300 కోట్లు మంజూరుకు నిర్ణయం తీసుకుంది.

అసోం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం మండలం వెలిదిలో 14 ఎకరాలు, చొప్పదండి మండలం రుక్మాపూర్ లో 5, గన్నేరువరం మండలంలో 5 ఎకరాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. గంగాధర డిగ్రీ కాలేజీకి 29, కేసముద్రం ఫైర్ స్టేషన్ కు 18 పోస్టులు మంజూరు చేసింది. మొత్తానికి ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ అటు స్టూడెంట్స్ కు, ఇటు నిరుద్యోగులకు, భక్తులకు ఎంతో మేలు చేకూర్చేలా సాగింది.
తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మొత్తం 2 లక్షల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాకు వివరించారు.
విద్యుత్ పంపిణీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న RDSSలో చేరేందుకు తెలంగాణ డిస్కంలు తయారు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని DCMSలను మార్క్ ఫెడ్లో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. TGRICని (తెలంగాణ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) హాకాలో విలినం చేయాలని కేబినెట్ నిర్ణయించింది అని పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ సేకరణ, పునరావాసం, మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు రూ.587 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని అన్నారు. అలాగే తెలంగాణను 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అందుకే నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.. దావోస్ ఈ పాలసీని లాంఛనంగా ఆవిష్కరించామన్నారు. ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలతో పాటు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications