అనంతపురంలో ఇద్దరు బాలికల అపహరణ
హైదరాబాద్: అనంతపురంలో ఇద్దరు బాలికలు అపహరణకు గురయ్యారు. వారు చర్చి స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నారు. చర్చి స్కూలు వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్న భోజనం చేయడానికి పాఠశాల బయటకు వచ్చినప్పుడు వారి అపహరణ జరిగింది.
ఇద్దరు బాలికలు లంచ్ కోసం బయటరు రాగానే కొంత మంది యువకులు వచ్చి వారి నోళ్లకు దస్తీలు అడ్డం పెట్టి అపహరించుకుపోయారు. కిడ్నాపర్లు ఎవరైందీ, కిడ్నాప్ ఎందుకు జరిగిందీ తెలియడం లేదు. బాలికల తల్లిదండ్రులకు శత్రువులు కూడా ఎవరూ లేరని అంటున్నారు.












Click it and Unblock the Notifications
