బాలికల కిడ్నాప్ కథ సుఖాంతం
అనంతపురం: అనంతపురంలోని బాలికల కిడ్నాప్ కథ సుఖాంతమైంది. చర్చి స్కూలుకు చెందిన నాలుగో తరగతి విద్యార్థినులు చరిష్మా, మైత్రిలను దుండగులు అనంతపురం శివారులోని వడియంపేట వద్ద వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగడంతో భయపడిన కిడ్నాపర్లు బాలికలను వదిలేసి వెళ్లినట్లు భావిస్తున్నారు.
ఇద్దరు బాలికలను దుండగులు పాఠశాల ద్వారం వద్ద ఉన్న సుమోలో అపహరించుకుపోయారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై దుండగులు పారిపోవడానికి అవకాశం ఉన్న మార్గంలోని పోలీసు స్టేషన్లను అన్నింటినీ అప్రమత్తం చేశారు. పట్టుబడడానికి అవకాశం ఉందని భయపడిన దుండగులు బాలికలను వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
