చిత్తూరు జిల్లాలో "పేలుళ్ళ ప్రకంపనలు"
హైదరాబాద్: హైదరాబాద్ పేలుళ్లతో సంబంధం ఉన్న బంగ్లాదేశీ యువతి రఫ్సంజానీకి చిత్తూరు జిల్లాతో సంబంధం ఉందని తేలింది. ఈ విషయం తెలిసిన తమిళనాడు పోలీసులు చిత్తూరు జిల్లా నగరి మండలం కీళ్ళపట్టు గ్రామాన్ని సందర్శించి రహస్యంగా ఆరా తీశారు.
ఈ గ్రామంలో రఫ్సంజీనీ వారం రోజులు మకాం వేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసుల సోదాల్లో ఒక సిడి కూడా లభ్యమైనట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులు దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించడానికి వ్యూహరచన చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
