ఎమ్మెల్యే ఇంటి వద్ద పేలుడు: ఇద్దరికి గాయాలు

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా నాగులపల్లిలో శుక్రవారంనాడు బాంబు పేలి ఇద్దరు గాయపడ్డారు. వారిని కాకినాడ అస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. శాసనసభ్యుడు బుల్లబ్బాయిరెడ్డి ఇంటి సమీపంలో ఈ బాంబు పేలింది. దీంతో తీవ్ర సంచలనం రేకెత్తింది. బాంబు పేలిన స్థలంలో వైర్లు, జిలిటెన్ స్టిక్స్ కనిపించాయి.

బాంబు పేలుడుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ఇది నాటు బాంబు పేలుడేమోనని మొదట అనుకున్నారు. పందులను బెదిరించడానికి పేల్చి ఉంటారని భావించారు. అయితే పేలుడు పదార్థాలను గమనించిన తర్వాత అనుమానాలు పెరగడం ప్రారంభమైంది. ఆ ప్రాంతంలో ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మండళ్ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న నక్సలైట్లు ఈ పనికి పూనుకుని ఉంటారా అనే కోణం నుంచి కూడా దర్యాప్తు సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+