విజయవాడలోని ఫర్నీచర్ షాపులో మంటలు
విజయవాడ: విజయవాడలో ఒక ఫర్నీచర్ దుకాణంలో శుక్రవారం మధ్యాహ్నం పెద్ద యెత్తున మంటలు లేచాయి. కృష్ణలంకలోని శ్రీనివాస టవర్స్ లో ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణం సిబ్బంది మంటల్లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఈ అపార్టుమెంటులో 30 దాకా ఫ్లాట్లు ఉన్నాయి. అగ్ని ప్రమాదంతో భీతిల్లిన అపార్టుమెంటువాసులు పై అంతస్థుపైకి చేరుకుని ఆందోళన చెందుతున్నారు.
ఫర్నీచర్ షాపు మొత్తం ఐదు నిమిషాల్లో తగులబడిపోయింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను ఆర్పడానికి దాదాపు 15 ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి. ఫైరింజన్లు ఆలస్యంగా రావడంపై స్థానికులు గొడవ పడ్డారు.












Click it and Unblock the Notifications
