విశాఖ గురించి ముందే తెలిసి ఉంటే..: దేవానంద్
విశాఖపట్నం: విశాఖపట్నం అందాలు ముందే చూసి ఉంటే తాను ఇక్కడ ఓ సినిమా తీసి ఉండేవాడినని బాలీవుడ్ ప్రముఖ నటుడు దేవానంద్ అన్నారు. పార్లమెంటు సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి జన్మ దినోత్సవానికి వచ్చిన ఆయన మంగళవారంనాడు విశాఖలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. తాను ఇంతకు ముందు విశాఖపట్నం రాలేదని, ఇదే తొలి సారి అని ఆయన అన్నారు.
విశాఖపట్నం ఎంతో అందంగా ఉందని, రైలు వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయని, మంచి లొకేషన్స్ ఉన్నాయని, ఈ విషయాలు ముందే తెలిసి ఉంటే తాను ఇక్కడ సినిమా తీసి ఉండేవాడినని ఆయన అన్నారు. ఇప్పటికైనా తగిన కథ దొరికితే ఇక్కడ సినిమా తీస్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications