ఫోరెన్సిక్ నివేదిక: వెంకట్ కు అనుకూలం?
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డి హత్య కేసు నుంచి పిసిసి మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు కుమారుడు వెంకట్ బయట పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఫోరెన్సిక్ నివేదిక వెంకట్ కు అనుకూలంగా వచ్చినట్లు సమాచారం. రక్తనమూనాలను, శరీరంలో ఆల్కహాల్ ఉనికి, బుల్లెట్ ప్రశాంత్ కణతలోకి దూసుకెళ్లిన తీరు వంటి అంశాలను పరిశీలించి ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక కోర్టుకు సమర్పించారు.
రివాల్వర్ పై ప్రశాంత్ రెడ్డి వేలిముద్రలు ఉన్నట్లు తేలినట్లు సమాచారం. గన్ పౌడర్ ప్రశాంత్ రెడ్డి భుజంపై కనిపించినట్లు ఫోరెన్సిక్ నివేదిక తేల్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రశాంత్ రెడ్డిది ఆత్మహత్యగా తేలే పరిస్థితులున్నట్లు భావిస్తున్నారు. వెంకట్ ఇంటిలో మంగళవారం సోదాలు నిర్వహించారు. అదే ఇంటిలో వెంకట్ ను, ఆయన భార్య దివ్యను సిఐడి పోలీసులు విచారించారు.












Click it and Unblock the Notifications