పవన్, రేణూల పెళ్లికి తగిన ఆధారాలు లేవు: నివేదిక
విశాఖపట్నం: సినీ నటుడు పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల పెళ్లి జరిగినట్లు సరైన సాక్ష్యాధారాలు లభించలేదని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. ఈ మేరకు పోలీసులు గురువారంనాడు కోర్టుకు ప్రాథమిక నివేదికను సమర్పించారు. సమగ్ర నివేదికను సమర్పించడానికి తమకు మరింత గడువు కావాలని పోలీసులు కోర్టును కోరారు. షర్డీలో కొన్ని సాక్ష్యాధారాలు సేకరించామని, హైదరాబాదులో మరి కొంత మందిని విచారించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. దాని వల్ల మరింత గడువు కోరారు. దీనికి పవన్ కళ్యాణ్ భార్య నందిన తరఫు న్యాయవాది సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం తెలిపారు.
పోలీసు దర్యాప్తునకు ఆదేశించి ఇప్పటికే 3 నెలలు గడిచాయని, పోలీసులు ఇప్పటి వరకు సేకరించిన సమాచారంతో నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించాలని ఆయన అన్నారు. ఇరువురు వాదనలు విన్న కోర్టు పవన్ కళ్యాణ్ బహు భార్యాత్వం కేసు విచారణను వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.












Click it and Unblock the Notifications