సల్మాన్ పై ఇస్లాం మత పెద్దల మండిపాటు
ముంబయి: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. లాల్ నగర్ లోని గణేశుడి విగ్రహాన్ని సందర్శించినందుకు సల్మాన్ ఖాన్ పై ముస్లిం మత పెద్దలు మండిపడుతున్నారు. ఈ విషయంపై ఉత్తర ప్రదేశ్ లోని ఒక దర్గా ఫత్వా జారీ చేసింది. ముస్లింలు ఏ విగ్రహాన్ని కూడా ప్రార్థించకూడదని ఆ ఫత్వాలో అన్నారు.
సల్మాన్ వినాయక మంటపాన్ని సందర్శించడం ఇస్లాం మతానికి విరుద్ధమని వారంటున్నారు. సల్మాన్ పై ఫత్వా జారీ చేసేందుకు హైదరాబాద్ ముస్లిం మత పెద్దలు కూడా సిద్ధపడుతున్నారు.












Click it and Unblock the Notifications