కెసిఆర్ తెలంగాణకు ఓ పీడ: టిడిపి
హైదరాబాద్: తెలంగాణకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఒక పీడ అని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెరాస తుడిచిపెట్టుకుపోయిందని ఆయన అన్నారు. ఉనికిని కాపాడుకోవడానికే కెసిఆర్ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు కెసిఆర్ కు లేదని ఆయన అన్నారు.
భూపోరాటంపై ఉక్కు పాదం మోపాలనే నిర్ణయం నిరంకుశత్వమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విడిగా ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. బడా పారిశ్రామికవేత్తలకు భూములు అప్పగిస్తున్న ప్రభుత్వం సామాన్యులను అరెస్టు చేయడం దారుణమని ఆయన అన్నారు. వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications