ప్రజల అవసరాలు తీర్చడం లేదనే..: వైయస్
హైదరాబాద్: ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న భూపోరాటాల పట్ల పేద ప్రజలు ఆకర్షితులవుతున్నారంటే లోపం మనలోనే ఉందని గుర్తించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జిల్లా కలెక్టర్లతో అన్నారు. భూపంపిణీపై, వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితిపై ఆయన గురువారంనాడు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. భూపోరు వైపు పేద ప్రజలు వెళ్తున్నారంటే వారి అవసరాలను మనం పూర్తిగా తీర్చలేదని అర్థమని ఆయన జిల్లా అధికారులతో అన్నారు.
భూపోరు వైపు ప్రజలు పోతున్నారంటే అధికారులు ఇందిరమ్మ కార్యక్రమం విషయంలో సరిగా పనులు చేయడం లేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు పంపిణీ చేయడానికి భూములు గుర్తించాలని ఆయన ఆదేశించారు. మూడవ విడత ఇందిరమ్మ కార్యక్రమానికి భూములను సేకరించే పనికి పూనుకోవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications