నా భార్యను కేసుల్లో ఇరికిస్తామన్నారు: వెంకట్
హైదరాబాద్: తన భార్య దివ్యను కేసుల్లో ఇరికిస్తామని, ఆమెను ఇబ్బందులకు గురిచేస్తామని సిఐడి అధికారులు తనను బెదిరించినట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డి మృతి కేసులోని నిందితుడు, పిసిసి మాజీ అధ్యక్షుడు వెంకట్ ఆరోపించారు. వెంకట్ ను సిఐడి అధికారులు శుక్రవారం సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా వెంకట్ సిఐడి అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ కోర్టుకు నివేదించుకున్నారు. తాము చెప్పినట్లు వినకపోతే మరో నాలుగు కేసులు బనాయిస్తామని కూడా సిఐడి అధికారులు హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.
తనకు వైద్యం కూడా సరిగా చేయించలేదని ఆయన అన్నారు. అనారోగ్యంతో ఉన్నా కూడా తనను బలవంతంగా డిశ్చార్జి చేయించారని, ఇందుకు తన చేత బలవంతంగా లేఖ రాయించారని ఆయన అన్నారు. విచారణ నిమిత్తం తమ అదుపులోకి తీసుకున్న వెంకట్ ను గడువు ముగియడంతో శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఈ నెల 26వ తేదీ వరకు వెంకట్ ను జ్యుడిష్యల్ రిమాండుకు పంపుతూ ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు ఆయనకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపించారు.












Click it and Unblock the Notifications