అవధ్ రైల్లో మంటలు: ప్రయాణికులు సురక్షితం
అహ్మదాబాద్: అహ్మదాబాద్ అవధ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఐదు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కొంతమందికి స్వల్పగాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని గొరఖ్‌పూర్ నుంచి ముంబాయి వెళ్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ రైలు బారఖ్ జిల్లాకు చేరుకున్న సమయంలో అకస్మాత్తుగా ఒక బోగీలో మంటలు చెలరేగాయి.
సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలాన్ని చేరుకుని అగ్నిమాపక దళ సిబ్బంది సహాయంతో మంటలు ఆర్పినట్లు రైల్వేవర్గాలు చెప్పాయి. కాలిన బోగీలను తొలగించామని తెలిపాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications