యమదొంగ ప్రింట్లను ఎత్తుకెళ్లిన చిరు ఫ్యాన్స్
అమలాపురం: తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా ప్రింట్లు ఎత్తుకెళ్లారు. అమలాపురంలోని రమా థియేటరుపై చిరంజీవి అభిమానులు దాడి చేసి ఆ చర్యకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రమా థియేటరుపై దాడికి నిరసనగా అమలాపురంలో థియేటర్లను మూసివేశారు.
చిరంజీవి తనయుడు రామచరణ్ తేజ నటించిన చిరుత ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. ఈ స్థితిలో యమదొంగ సినిమా ప్రింట్ల అపహరణ ఎటు దారి తీస్తుందోననే ఆందోళన చెలరేగుతోంది. చిరుత సినిమాను చిరంజీవి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. తండ్రి తగిన తనయుడిగా రామచరణ్ తేజ నీరాజనాలు అందుకోవాలనేది ఆయన కోరికగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications
