విశాఖలో నలుగురు మావోయిస్టుల హతం


విశాఖపట్నం: విశాఖపట్నం జి. మాడుగుల అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య బుధవారంనాడు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి అదనపు బలగాలు చేరుకున్నాయి. ఇరు పక్షాలకు మధ్య చాలా సేపు ఎదురుకాల్పులు జరిగాయి. మరణించినవారిలో ముగ్గురు మహిళ నక్సలైట్లు ఉన్నట్లు జిల్లా ఎస్పీ చెప్పారు.

సంఘటనా స్థలం నుంచి పోలీసులు రెండు 303 రైఫిళ్లు, ఒక తపంచా, ఇతర ఆయుధాలు లభ్యమయ్యాయి. విశాఖపట్నం జిల్లా చింతపల్లి ప్రాంతంలో పోలీసులు బుధవారంనాడు మావోయిస్టులు అమర్చిన మూడు మందుపాతరలను వెలికి తీశారు. వాటిని నిర్వీర్యం చేశారు. మరిన్ని మందుపాతరలు అమర్చి ఉంటారనే అనుమానంతో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+