ప్రశాంత్ ను కాల్చి చంపారు: ఉస్మానియా నివేదిక
హైదరాబాద్: ఇతరులు కాల్చడం వల్లనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డి మరణించాడని ఉస్మానియా ఆస్పత్రి పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ప్రశాంత్ రెడ్డి పిసిసి మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు కుమారుడు ఇంట్లో జరిగిన కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. ప్రశాంత్ రెడ్డిని తానే కాల్చి చంపానని వెంకట్ ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఉస్మానియా ఆస్పత్రి పోస్టుమార్టమ్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇతరులు కాల్చడం వల్ల కూడా ప్రశాంత్ రెడ్డి భుజంపై గన్ షాట్ రెసిడ్యూ ఉండే అవకాశం ఉందని ఆ నివేదిక వెల్లడించింది. ప్రశాంత్ రెడ్డి మృతదేహంపై ఐదు గాయాలున్నాయని కూడా నివేదిక తెలియజేసింది. ఇదిలా ఉంటే, ప్రశాంత్ రెడ్డి హత్య కేసులో వెంకట్ కు మరో 14 రోజుల పాటు రిమాండుకు పంపిస్తూ బుధవారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications
