చంద్రబాబు నోట ఉచిత విద్యుత్ మాట
హైదరాబాద్: తాము అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 9 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తామని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో హామీ ఇచ్చింది. పార్టీ పోలిట్ బ్యూరోలో తీసుకున్న నిర్ణయాలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తు విషయంలో మాట మార్చిందని, 9 గంటలు సరఫరా చేస్తామని హామీ ఇచ్చి 7 గంటలు మాత్రమే అందిస్తోందని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టు షాపులను రద్దు చేస్తామని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనవర్గాలను అణగదొక్కుతోందని, గీత కార్మికులకు న్యాయం చేయడం లేదని ఆయన అన్నారు. ప్రైవేట్ గురుకుల పాఠశాలల వల్ల అనేక అనర్థాలు తలెత్తుతాయని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
హౌసింగ్ బోర్టును ప్రభుత్వం వ్యాపార సంస్థగా మార్చేసిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, పేదలకు సెంటు భూమి కూడా మిగిలే పరిస్థితి లేదని ఆయన అన్నారు. భూపోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
