ఫ్లై ఓవర్ ప్రమాదంలో గామన్ ఇండియానే దోషి: నివేదిక
హైదరాబాద్: హైదరాబాదులోని పంజగుట్ల ఫ్లై ఓవర్ దుర్ఘటనలో దోషి గామన్ ఇండియానేనని శివారెడ్డి కమిటీ తేల్చింది. ఫ్లై ఓవర్ ప్రమాదంపై విచారణ జరిపిన శివారెడ్డి కమిటీ గురువారంనాడు తన నివేదికను మున్సిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావుకు సమర్పించింది. ఫ్లై ఓవర్ కూలి మరణాలు సంభవించడానికి, నష్టం జరగడానికి గామన్ ఇండియా బాధ్యత వహించాలని కమిటీ అభిప్రాయపడింది. ఫ్లై ఓవర్ నిర్మాణం కాంట్రాక్టును తీసుకున్న గామన్ ఇండియా నుంచి ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం అపరాధ రుసుం వసూలు చేయాలని సిఫార్సు చేసింది.
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కూడా ప్రమాదానికి కారణమని కమిటీ అభిప్రాయపడింది. మెట్రో వాటర్ వర్క్స్, గ్రేటర్ హైదరాబాద్ సంస్థ అధికారులు, సబ్ కాంట్రాక్టర్లు కూడా ఫ్లై ఓవర్ ప్రమాదానికి బాధ్యత వహించాలని సిఫారసు చేసింది. మెట్రో వాటర్ తవ్వకాలు కూడా ప్రమాదానికి కారణమని కమిటీ అన్నది. మెరుగైన సపోర్టింగ్ వ్యవస్థ లేకపోవడం ప్రమాదానికి కారణమని అభిప్రాయపడింది. శివారెడ్డి కమిటీ 157 పేజీల నివేదికను రూపొందించింది.












Click it and Unblock the Notifications
