బొత్సాపై రాఘవులు గరం గరం
హైదరాబాద్: రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణపై సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇందిరమ్మ గృహాల్లో జరుగుతున్న అవినీతిని బయట పెడుతున్నందుకు తట్టుకోలేకనే బొత్సా సత్యనారాయణ తమపై ఎదురుదాడి చేస్తున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమపై బొత్సా సత్యనారాయణ తమపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు.
ఇందిరమ్మ గృహాల కేటాయింపుల్లో జరుగుతున్న అవినీతిని తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు గుర్తించి వివరాలతో బొత్సా సత్యనారాయణకు లేఖలు రాశారని, వాటిపై మంత్రి సమాధానాలు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. తాము ఎత్తి చూపిన విషయాలు నిజమా, కాదా అని మంత్రి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందిరమ్మ గృహాలు అనర్హులకు దక్కుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
