హైదరాబాదులో సునీతా విలియమ్స్
హైదరాబాద్: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ఆమెకు గురువారంనాడు హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. ఆమె హైదరాబాదులో జరుగుతున్న అంతరిక్ష కాంగ్రెస్ లో ప్రసంగిస్తారు.
ఆరు నెలల పాటు అంతరిక్షంలో ఉన్న తన అనుభవాలను ఆమె పంచుకుంటారు. ఆమె కొంత మంది విద్యార్థులతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఈ అంతరిక్ష కాంగ్రెసులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ కూడా పాల్గొంటారు.












Click it and Unblock the Notifications
