తెలంగాణ వస్తే 12 గంటలు ఉచితం: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వ్యవసాయానికి 12 గంటల పాటు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రెండు రూపాయలకు కిలో బియ్యం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటుండగా, తాము వ్యవసాయానికి 9 గంటల పాటు ఉచిత విద్యుత్తు ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తానేమీ తక్కువ తినలేదంటూ చంద్రశేఖరరావు వ్యవసాయానికి 12 గంటల పాటు ఉచిత విద్యుత్తు ఇస్తామని హామీ ఇచ్చారు.
ప్రత్యేక తెలంగాణలోనే రైతులకు ఉచిత విద్యుత్తు సరఫరా సాధ్యమని ఆయన అన్నారు. తెలంగాణలోని విలువైన భూముల అమ్మకాలకు ఆద్యుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.












Click it and Unblock the Notifications
