తెలంగాణపై నా వైఖరి మారదు: మధుయాష్కీ
హైదరాబాద్: తెలంగాణ విషయంలో తన వైఖరి మారబోదని ఎఐసిసి కార్యదర్శిగా నియమితులైన నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ స్పష్టం చేశారు. తన నిజాయితీ వల్లనే తనకు ఎఐసిసి కార్యదర్శి పదవి దక్కిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మధుయాష్కీ గౌడ్ గట్టిగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఎఐసిసి కార్యదర్శిగా నియమితులైన తర్వాత హైదరాబాదుకు వచ్చిన ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పెద్ద యెత్తున అభిమానులు తరలివచ్చి ఆయనకు స్వాగతం పలికారు. మధుయాష్కీకి అనుకూలంగా, తెలంగాణకు అనుకూలంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications
