ముస్లిం కోటా అడ్మిషన్లు ఆపండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ముస్లిం రిజర్వేషన్ల కోటా కింద అడ్మిషన్లు జరపకూడదని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.
మత ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించడం పట్ల సుప్రీంకోర్టు అభ్యంతరం తెలియజేసింది. ముస్లింలలోని వెనకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించాలనుకుంటే ప్రస్తుతం ఉన్న బిసి కోటాను మరో 4 శాతం పెంచి అమలు చేయవచ్చు కదా అనే అభిప్రాయాన్ని కూడా కోర్టు వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications
