వన్ ఇండియా తెలుగు పోర్టల్ మొబైల్ వెర్షన్
బెంగుళూరు: ప్రయాణిస్తూ కూడా వన్ ఇండియా యూజర్లు సమాచార స్రవంతిని చూసుకోవచ్చు. భారతీయ భాషా పోర్టల్స్ తో భారతదేశంలో అగ్రస్ధానంలో ఉన్న వన్ ఇండియా ఇంగ్లీషులోనే కాక తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో .మొబి సైట్స్ ను ప్రారంభించింది.
జీఅర్ పి ఎస్ ఎనేబుల్డ్ మొబైల్స్ ను ఈ కింది ఈ యూఆర్ ఎల్స్ తో అనుసంధానించడం ద్వారా వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. వన్ ఇండియా.ఇన్ (oneindia.mobi),దట్స్ తెలుగు.వన్ ఇండియా.ఇన్.మొబి ( http://thatstelugu.oneindia.mobi) యూఆర్ ఎల్స్ ను అనుసంధానించుకోండి. ఇంకా తమిళం, మల యాళం, కన్నడ లో కూడా వార్తలు పొందవచ్చు. ఈ పోర్టల్స్ లోని వ్యాప్ వెర్షన్లను యూజర్లు పొందవచ్చు.
వన్ ఇండియా భారతదేశంలో తొలిసారిగా ప్రాంతీయ భాషా మొబి సైట్లను సమర్పిస్తోంది. ఈ వ్యాప్ సైట్లు వార్తలు, క్లాసిఫైడ్స్, టీవీ, సినిమా లిస్టింగ్స్ ను ఒక్క క్లిక్ లో ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందిస్తోంది. అంతే కాదు ఆరు ప్రధాన భారతీయ నగరాల్లో సినిమాల ప్రదర్శన సమయాలను తెలుసుకోవచ్చు.
" మొబైల్ ఫోన్స్ మరో సమాచార విప్లవాన్ని తీసుకొస్తున్నాయి. ప్రతి ఐదుగురు మొబైల్ యూజర్లలో ఒకరు ఫోన్ ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ పొందాలనుకుంటున్నారని ట్రాయ్ గణాంకాలు చెబుతున్నాయి" అని గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీస్ సిఇవో బి జి మహేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ కావచ్చు, మొబైల్ కావచ్చు తన యూజర్లకు సులభంగా ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వాలన్నది వన్ ఇండియా ధ్యేయమని ఆయన తెలిపారు.
భారతదేశంలోని అన్ని రకాల మొబైల్ ఇన్ స్ట్రుమెంట్లకు అనువుగా ఉండే ఈ మొబి సైట్ల కు సంబంధింఛిన మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి http://oneindia.in/mobile












Click it and Unblock the Notifications
